Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు.. రిటైర్మెంట్ వయసు పెంపు, సర్టిఫికెట్లకు బ్లాక్ చైన్ భద్రత!
మంత్రి లోకేష్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
బోర్డు పరిధిలో పనిచేసే సిబ్బంది పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ అధికారికంగా తీర్మానించింది.
అలాగే, 1978 నుంచి ఇప్పటివరకు జారీ చేసిన పాత సర్టిఫికెట్లన్నింటినీ డిజిటలైజ్ చేసి, మరింత భద్రత కోసం వాటిని 'బ్లాక్ చైన్' టెక్నాలజీకి అనుసంధానించనున్నారు.వీటితో పాటు పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకన విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇచ్చే భత్యాన్ని 25 శాతం వరకు పెంచాలని బోర్డు నిర్ణయించింది.
విద్యార్థులకు థియరీ పరీక్షల్లో ఇకపై 32 పేజీలతో కూడిన ఆన్సర్ షీట్లను ఒకేసారి అందించాలని తీర్మానించారు
Tags:#Andhra Pradesh#National





